Vivo Y19e: 5500mAh బ్యాటరీ, AI కెమెరా వంటి సూపర్ ఫీచర్లు...కేవలం రూ.7,999కే 11 d ago

వివో బ్రాండ్ అంటే తెలియని వాళ్లే లేరు..ఎందుకంటే అద్భుతమైన ఫీచర్లను అతితక్కువ ధరకే అందిస్తుంది. వివో సంస్థ భారత మార్కెట్లోకి సరికొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. Vivo Y19e పేరుతో విడుదలైన ఈ ఫోన్ మన్నికైన డిజైన్‌తో పాటు, శక్తివంతమైన బ్యాటరీ, AI ఆధారిత కెమెరా వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఇంకొక విషయం ఈ ఫోన్ కేవలం రూ.10 వేల లోపే లభిస్తుంది. పదివేల రూపాయల లోపు ఒక మంచి ఫోన్ రావడమే కష్టం అనుకుంటే.. Vivo కంపెనీ ఈ ఫోన్ తో ఏకంగా తక్కువ ధరకే, అద్భుతమైన ఫీచర్లను అందిస్తుంది. ఇక ఈ ఫోన్ వివరాల్లోకి వెళ్దాం రండి!
Vivo Y19e ఫోన్ స్పెసిఫికేషన్లు:
ప్రాసెసర్: UniSoC T7225 SoC
డిస్‌ప్లే: 6.74 HD+ LCD స్క్రీన్
రిఫ్రెష్ రేట్: 90Hz
బ్యాటరీ: 5500mAh
ఛార్జింగ్: 15W ఛార్జింగ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 14, FunTouch OS
కాన్ఫిగరేషన్: 4GB RAM + 64GB స్టోరేజ్
బ్యాక్ కెమెరా: 13MP మెయిన్ + 0.08MP సెకండరీ
ఫ్రంట్ కెమెరా: 5MP
ఫోన్ ధర : 7,990/-
కనెక్టివిటీ ఫీచర్లు:
- బ్లూటూత్ 5.0
- USB టైప్-C పోర్ట్
- Wi-Fi
- 4G డ్యూయల్ సిమ్
కలర్ ఆప్షన్స్:
- టైటానియం సిల్వర్
- మెజెస్టిక్ గ్రీన్
ప్లస్ పాయింట్స్:
- పెద్ద బ్యాటరీ కారణంగా ఎక్కువ సమయం వస్తుంది.
- IP64 ధూళి మరియు నీటి నిరోధకత, MIL STD 810H మిలిటరీ-గ్రేడ్ మన్నిక.
- AI ఆధారిత కెమెరా ఫీచర్లు బాగుంటాయి.
- బడ్జెట్ ధరలో అందుబాటులో ఉంది.
మైనస్ పాయింట్స్:
- నెమ్మదైన 15W ఛార్జింగ్
- తక్కువ రెసొల్యూషన్ కెమెరాలు
- 5G నెట్‌వర్క్ లేదు
Vivo Y19e ఫోన్ లో ధరను మించిన ఫీచర్లు ఉన్నాయి. ప్రత్యేకంగా AI ఆధారిత కెమెరా, భారీ బ్యాటరీ చాలా బాగున్నాయి. సాధారణ ఉపయోగానికి ఒక మంచి బడ్జెట్-ఫ్రెండ్లీ ఫోన్ కోరుకునే వారికీ ఇది చాలా మంచి ఎంపిక. ఈ ఫోన్ లో 5G సపోర్ట్ లేకపోవడం..కేవలం ఒక వేరియంట్ తోనే రావడం వంటి లోపాలున్నప్పటికీ కేవలం రూ. 7,999 ధరతో లభిస్తూ మార్కెట్ లో మంచి స్పందనని పొందింది. ఇది Vivo వెబ్‌సైట్ మరియు ఫ్లిప్‌కార్ట్ లో అందుబాటులో ఉంది.
ఇది చదవండి: Motorola Edge 50 Fusion--మిడ్-రేంజ్ ఫోన్‌లో సరికొత్త డిజైన్.. బడ్జెట్‌లో బెస్ట్ డిస్‌ప్లే.!